Thursday, 5 November 2026

ప్రజలకు స్థానికంగా ఉండే ప్రదేశంలోనే రేషన్ అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

 

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ మే 15 జనం సాక్షిప్రజలు స్థానికంగా ఉండే ప్రదేశాల్లోనే రేషన్ సరుకులు అందించాలని వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్”* పేర్కొన్నారు సోమవారం”మీతో నేను”* కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణ పరిధిలోని 11వ వార్డుకొట్టంగుట్ట తండా, జాంబాపూర్ తండా* మరియు గెరిగేట్ పల్లి* గ్రామాలలో11 వ వార్డు పరిధిలోని కొట్టం గుట్ట తండా మరియు జాంబాపూర్ తండాలలో స్థానికంగా అక్కడే ఏదైనా తండాలో రేషన్ బియ్యం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.*11వ వార్డులో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, పాత స్థంబాలు మరియు వాటికీ ఉన్న తీగలను తొలగించి, అవసరమైన చోట నూతన స్థంబాలు ఏర్పాటు చేయాలని తదితర విద్యుత్ సమస్యలను పరిష్కారం చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.మిషన్ భగీరథ పైపులు లీకేజీలు లేకుండా చూడాలని, కాలనీలల్లో త్రాగునీటి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ… నీటి సమస్య రాకుండా చూడాలన్నారు.మిషన్ భగీరథ మంచినీటిని తాగాలని, అధికారులు అందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. వార్డులలో అండర్ డ్రైనేజ్ మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.ప్రతిరోజు కచ్చితంగా చెత్త సేకరణ చేయాలని, మున్సిపల్ పరిధిలోని అన్ని గ్రామాలలో చెత్త బండి ప్రతి ఇంటికి వెళ్లాలన్నారు.పాడు బడ్డ ఇల్లు తొలగించాలని, కాలనీలను ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ.. పరిశుభ్రంగా ఉంచాలని, పట్టణ ప్రగతిలో చేయలేని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.11 వ వార్డు పరిధిలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రైతుబంధు పథకం ద్వారా ఆరుకోట్ల పదహారు లక్షల* పైచిలుకు పెట్టుబడి సహాయం అందించిందన్నారు.11 వ వార్డు పరిధిలో తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకం* ద్వారా 12 మంది రైతులు* మరణించగా 5 ఐదు లక్షల* చొప్పున 60 లక్షల* ఆర్థిక సహాయం అందించిందన్నారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ కౌన్సిలర్లు పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కమల్ రెడ్డి వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.