అన్ని నిధులు మేమే తెచ్చామనడం సిగ్గు చేటు..!
– మంథని అభివృద్దికి నిరంతం కృషి చేస్తుంది పుట్ట మధే..!
– విలేకరుల సమావేశంలో మంథని ఎంపీపీ కొండ శంకర్
జనం సాక్షి, మంథని : ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అధికారం కోసం ఆబద్దాలు ఆడుతూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాడని మంథని మండల పరిషత్ అధ్యక్షులు కొండ శంకర్ విమర్శించారు. గురువారం మంథనిలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మంథని ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగేళ్లు గడుస్తున్నా ఎలాంటి అభివృధ్ది పనులు చేయని శ్రీధర్‌బాబు ఈనాడు ఉపాధి హమీ ద్వారా పెద్ద ఎత్తున నిధులు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఏదైనా సమస్య చెప్పితే అధికారంలో మేము లేమంటూ దాటవేస్తున్న శ్రీధర్‌బాబు ఈనాడు తేని నిధులను తెచ్చామని చెప్పుకోవడంలో ఆంతర్యం ఏమిటో ఆలోచన చేయాలన్నారు. జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మొదటి విడతలో పంపిన ప్రపోజల్స్‌కు రూ.8.34కోట్లు మంజూరయ్యాయని, మొదటి విడతలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఒక్క ప్రపోజల్ పంపలేదని, ఒక్క రూపాయి రాలేదన్నారు. రెండో విడతగా 75 పనులకు రూ.6.90కోట్లతో పాటు ఉప్పట్లకు అదనంగా రూ.60లక్షలు మంజూరయ్యాయని వివరించారు. రెండో విడతలో ఎమ్మెల్యే పంపిన ప్రపోజల్స్‌కు కేవలం రూ,2.03కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్దిబాటలో నడిపించాలన్న గొప్ప ఆలోచనతో మంత్రి ఎరవెల్లిదయాకర్రావును స్వయంగా కలిసి వినతిపత్రాలు అందించారని, ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసునని అన్నారు. అయితే నియోజకవర్గానికి ఉపాధి హమీ పథకం ద్వారా తన సిఫారసు మేరకు రూ.9.53 కోట్లు మంజూరయ్యయని ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. మంథని ఎమ్మెల్యే సిఫారస్‌తో రూ.2.03కోట్లు మంజూరయ్యాయని తాము బహిరంగంగా చెబుతున్నామని, అదే విధంగా జెడ్పీ చైర్మన్ ఫుట్ట మదు సిఫారసుతో రూ. 15.84కోట్లు మంజూరయ్యాయని ఎందుకు చెప్పడం లేదని అన్నారు. నిధులన్నీ మీ సిఫారస్‌తో మంజూరైతే వాటికి సంబంధించిన ప్రపోజల్, ప్రొసిడింగ్ కాపీలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలో తమ ప్రభుత్వం లేదని, తనతో ఏదీ కాదనే ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఇన్ని నిధులు తీసుకువచ్చారని చెప్పితే నమ్మె పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. అంతే కాకుండా ముత్తారం మండలం బగుళ్ల గుట్టకు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరీ చేయాలని మంత్రిని జెడ్పీ చైర్మన్ కోరడం జరిగిందని, నిధులు మంజూరైన వెంటనే తామే మంత్రిని కోరినట్లు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. అబద్దాలు ఆడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారని, ఎవరు అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మంథని సింగల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఏగోలపు శంకర్ గౌడ్ ,కిషన్ రెడ్డి, రవీందర్, నాయకులు తగరం శంకర్, లాల్ ఆకుల కిరణ్ పూదరి సత్యనారాయణ గౌడ్, ఆరెల్లి కొమరయ్య గౌడ్, మేదరవేన కుమార్, జూలపల్లి సర్పంచ్ బొల్లపల్లి శంకర్ గౌడ్, అక్కపాక సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్న ఎమ్మెల్యే




