Tuesday, 3 November 2026

డ్రైవర్ల జీతాలు పెంచాలి – కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్

జనం సాక్షి, కమాన్ పూర్: ఓ.సి.పి ఒన్ ఆర్.జి.3 ఏరియా కన్వెయన్స్ డ్రైవర్స్ నిరవధిక సమ్మె శిబిరాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ గురువారం సందర్శించారు.
శిబిరాన్ని ఉద్దేశించి గాండ్ల మోహన్ మాట్లాడుతూ.. డ్రైవర్లు జీతాలు పెంచాలని సమ్మె చేయడం సబబే నని ఆయన అన్నారు. నెల జీతం 21 వేలు సింగరేణి జి.ఓ ప్రకారం ఇవ్వాలని కానీ లారీ, టిప్పర్ ఓనర్స్ కేవలం 16 వేలు మాత్రమే చెల్లిచాలనుకోవడం వల్లే డ్రైవర్స్ సమ్మెకు దిగడం జరిగిందన్నారు. సింగరేణి యాజమాన్యం ఓనర్స్ తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆయన అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వారికి ఏరియర్స్ రావడం లేదని వారికి ఉద్యోగ భద్రత లేదని ఆయన అన్నారు. ఆయన వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు రంగు సత్యనారాయణ గౌడ్, జులపల్లి ఎం.పి.టి.సి.శవ్వ శంకర్ , మైనార్టీ జిల్లా కార్యదర్శి ఇక్బాల్, ఎస్సి సెల్ మండలాధ్యక్షుడు మల్యాల తిరుపతి తదితరులు ఉన్నారు.