మాతా శిశు ఆరోగ్య కేంద్రం నుంచి పేషంట్లను పెద్దపల్లికి తరలింపు

 జనంసాక్షి, మంథని : భారీ వర్షాల వల్ల మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రం లో నీరు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందస్తు చర్యల్లో భాగంగా గర్భిణీ, బాలింత స్త్రీలను, పసి పిల్లలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం పెద్దపల్లి మాతా శిశు కేంద్రంనకు మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ , హాస్పటల్ సూపర్డెంట్ శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉండి అంబులెన్స్ లో తరలించారు.అత్యవసరమైన ప్రసూతి / గర్భిణి స్త్రీ సేవల కొరకు మంథనిలోని సివిల్ ఆసుపత్రిలో వైద్య సేవలు యథావిధిగా అందించబడతాయని మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి సందర్భంగా తెలిపారు.

తాజావార్తలు