Saturday, 7 November 2026

ప్రజల ఆరోగ్యం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం

ప్రజల ఆరోగ్యం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం

వేమనపల్లి, నవంబర్27,(జనంసాక్షి)

మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన వేమనపల్లి మండలంలోని సుంపుటం గ్రామపంచాయతీలో నీల్వాయి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరానికి మండలంలోని పలు గ్రామాల ప్రజలు సుమారు1200 మంది రోగులకు ఉచితంగా వైద్యం అందించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో పది బృందాల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీపీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..ప్రజల భద్రత, సమస్యలు,అవసరాల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు.ప్రజలకు పోలీసుల సేవలను మరింత చేరువ చేసేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటి పోలీసింగ్ ద్వారా పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు.పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేస్తూ వారికి అందుబాటులో ఉంటున్నారని అన్నారు.అనుభవ నిపుణులైన డాక్టర్ల బృందాన్ని పిలిపించి ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకొని ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.అనంతరం పలు గ్రామాల్లోని యువకులకు వాలిబాల్,క్రికెట్ మొదలుగు క్రీడా సామాగ్రిని అందించారు.యువత చెడు మార్గాలపై వెళ్లకుండా సత్ప్రవర్తనతో కలిగి ఉండాలని అన్నారు.గ్రామంలోకి ఎవరైనా అపరిచిత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. సమాచారం అందించిన వ్యక్తుల పేర్లు గొప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసిపి నరేందర్, చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్,శ్రీరాంపూర్ సీఐ రాజు,సర్పంచ్ కొండగొర్ల బాపు,ఎస్ఐ లు గోపతి నరేష్,వెంకట్,శ్వేత,సుధాకర్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.