Thursday, 5 November 2026

సహకార సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి..

సహకార సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి…

చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి…

జనం సాక్షి,చెన్నారావుపేట

సహకార సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్ధసాని సత్యనారాయణ రెడ్డి అన్నారు. గురువారం 69వ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని సహకార సంఘం ఆవరణలో సహకార జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘం ద్వారా అందిస్తున్న రుణాలను, ఎరువులను గ్రామాల్లోని రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. అంతేకాక పంటల దిగుబడిని కూడా పెంచుకోవాలన్నారు. అదేవిధంగా సహకార సంఘంలో తీసుకున్న రుణాలను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ సంఘం అభివృద్ధికి పాటుపడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల కన్వీనర్, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రఫీ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అబ్దుల్ గఫార్, చెన్నారావుపేట గ్రామ సర్పంచ్ కుండె మల్లయ్య, మాజీ జడ్పిటిసి జున్నుతుల రామ్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ చింతకింది వంశీ, సొసైటీ డైరెక్టర్లు జంగిలి బాబు, మజ్జిగ రాంబాబు, మహమ్మద్ బషీర్, ఇస్లావత్ గోపి, జున్నుతుల రమాదేవి మహేందర్ రెడ్డి, ఎడ్ల మంజుల నారాయణరెడ్డి, మంచాల సరిత వెంకటేశ్వర్లు, సొసైటీ సీఈవో చిట్టె రవి, సొసైటీ సిబ్బంది సాదు కట్టారెడ్డి, మహమ్మద్ సలీం, మంచాల శ్రీనివాస్, మాసాడి రమేష్, ఇళ్ల సమ్మయ్య, ప్రదీప్, సురేందర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.