ప్రజల నుండి పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదును చట్టపరిదిలొ పరిష్కరిస్తాము
-జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్.
గద్వాల నడిగడ్డ, జనవరి 9 (జనం సాక్షి);
ప్రజల శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం పని చేస్తుందని అందులో భాగంగా ప్రజల నుండి పోలీస్ స్టేషన్ లకు వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు చట్ట పరిధిలో పరిష్కరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ అన్నారు.ప్రజావాణిలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం కు ప్రజల నుండి వచ్చిన 11 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భూ వివాదాలకు సంబందించిన సివిల్ వివాదాల విషయంలో ఎవరుకుడా పోలీస్ స్టేషన్ లకు తిరుగుతూ తమ సమయాన్ని వృదా చేసుకోవద్దని, సివిల్ వివాదాలు పోలీస్ స్టేషన్ లలో పరిష్కరించబడవు అనే విషయాన్ని గ్రహించాలని, సివిల్ వివాదాలు కోర్టులలో పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు.అమాయక ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి భూముల్లోకి దౌర్జన్యం గా ప్రవేశించడం, ఇతర చీటింగ్ చేసే వారి పై కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. సోమవారము వచ్చిన ఫిర్యాదులలో కుటుంబ తగాదాలకు సంభందించి 2 పిర్యాదులు,భూ వివాదాలకు సంభందించి 2,తండ్రీ కనిపించడం లేదని 1 పిర్యాదు, గ్రామం లో ప్రభుత్వం గతంలో ఇచ్చిన ప్లాట్స్ ను ఇతరులు అక్రమించారని 1 పిర్యాదు, ప్రక్క ఇంటి వారు న్యూసెన్స్ కు సంబంధించి 1 పిర్యాదు,
రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ ను చూపించడం లేదని 1 పిర్యాదు,బైక్ ను దొంగాలించరని 1పిర్యాదు,
ఇతర అంశాలకు సంబంధించి 2 పిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు.
ప్రజల నుండి పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదును చట్టపరిదిలొ పరిష్కరిస్తాము




