Wednesday, 4 November 2026

రసవత్తరంగా సాగుతున్న ఖిజర్ యఫై గోల్డ్ కప్ పోటీలు

రసవత్తరంగా సాగుతున్న ఖిజర్ యఫై గోల్డ్ కప్ పోటీలు
జహీరాబాద్ జనవరి 9 (జనం సాక్షి) పట్టణంలోని భాగ రెడ్డి క్రీడా మైదానంలో సోమవారం ఖిజర్ యఫై గోల్డ్ కప్ ప్రి క్వార్టర్ పోటీల్లో భాగంగా నేషనల్ సీసీ జహీరాబాద్, అల్ ఫిర్దోస్ శాంతినగర్ సీసీ జట్ల మధ్య జరిగిన పోటీలో నేషనల్ సీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తూ 19.1 ఓవర్లలో 115 పరుగులకు అలౌట్ అవ్వడంతో, 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అల్ ఫిర్దోస్ సీసీ 9 ఓవర్లలో 1 వికెట్ నష్టనికి 116 పరుగులు చేయడంతో నేషనల్ సీసీ జట్టుపై అల్ ఫిర్దోస్ 9 వికెట్లతో ఘన విజయం సాధించి ఖిజర్ యఫై గోల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది, మూడవ ప్రి క్వార్టర్ ఫైనల్లో బిఎఫ్ సీఏ మరియు కె ఎఫ్ కోహినూర్ సీసీ మధ్య జరిగిన పోటీలో బి ఎఫ్ సి ఏ సీసీ టాస్ గెలిచి ఫీల్డింగ్ చేయడంతో కోహినూర్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టనికి 224 పరుగులు చేయడంతో 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బి ఎఫ్ సి ఏ జట్టు 16.2 ఓవర్లలో 142 పరుగులకు అలౌట్ అవ్వడంతో 82 పరుగులతో విజయం సాధించి కె ఎఫ్ కోహినూర్ జట్టు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది, 97 పరుగులు చేసి బౌలింగ్ లో 3 వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలక భూమిక వహించిన ఆఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది, ఈ సందర్భంగా ముఖ్య అతిధి పాల్గొన్న సయ్యద్ విఖర్, ఫాయజ్ అహేమద్ మాట్లాడుతూ అంకితభావంతో ముందుకు వెళ్ళినట్టైతే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వేదికల మీద ఆడే అవకాశం ఉందని, క్రీడాకారులు ఆటలో తమ తమ జట్ల తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలని, క్రిడ మైదానంలో రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి ప్రదర్శనలు మరిన్ని కనబర్చలని అన్నారు. కార్యక్రమంలో మొహమ్మద్ అలీ, మొహమ్మద్ మాక్సుద్, సయ్యద్ విఖర్, మర్రి బాల్ రెడ్డి, సద్దమ్ కుసంగి, తజోద్దీన్ శేకపూర్, గౌస్ ఖాన్, మాక్సుద్ ఖాన్, ఇస్మాయిల్ శేకపూర్, అదం యఫై, అబుద్ యఫై, పబ్బతి సంతోష్, తయ్యబ్ అలీ, మద్ద రామి రెడ్డి, ఆర్గనైజర్లు మాక్సుద్ అలీ, ఖాజా పటేల్, బాబాన్, అమనుల్లా ఖాన్, అజ్మత్ అలీ, మొహమ్మద్ సాజిద్, అసద్ యఫై, శ్రీనివాస్ ముదిరాజ్, మొహమ్మద్ సలీమ్, ఆర్షద్ ఖాన్, ఆసీఫ్ పటేల్, ఇబ్రహీం, నాయకులు, అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్నారు.