Wednesday, 4 November 2026

ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత. – బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్

.
నెన్నెల, మే 25, (జనంసాక్షి )ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత అని బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన నెన్నెల మండలం కోణంపేట గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసీపీ సదయ్య ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటక్ట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని, గ్రామాల్లో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్ లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలని అన్నారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈకార్యక్రమంలో నెన్నెల ఎస్సై శ్యామ్ పటేల్, బెల్లంపల్లి 2టౌన్ ఎస్సై రవి కుమార్, స్థానిక సర్పంచ్ కంకణాల తిరుపతి రెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.