Wednesday, 4 November 2026

ప్రజల సంక్షేమం కోసమే బృహత్తర పథకాలు : మంత్రి మల్లారెడ్డి

 

 

 

 

 

 

:శామీర్ పేట్, జనం సాక్షి : పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందజేసి అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం మూడుచింతలపల్లి గ్రామంలోనీ ఎంపీడీఓ కార్యాలయంలో మండలానికి తెలంగాణ ప్రభుత్వం తరుపున మంజూరు అయినా 47 షాదీ ముబారక్ కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు .అనంతరంజి ఓ 58 లో మంజూరు అయినా మండలం సంబందించిన లబ్దిదారులకు ఇంటి పట్టా సర్టిఫికెట్లను పంపిణి చేశారు .ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ హారిక మురళి గౌడ్, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి,వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,సర్పంచ్ జాం రవి,ఎమ్మార్వో,ఎంపీటీసీలు,సర్పంచ్లు, మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్,వార్డ్ సభ్యులు , అధికారులు,తదితరులు పాల్గొన్నారు.