Wednesday, 4 November 2026

వీణవంకలో ఘనంగా భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 6( జనం సాక్షి )వీణవంక మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో ఇప్పల పల్లె.చల్లూరు. గ్రామాలలో బిజెపి పార్టీ హుజురాబాద్  అసెంబ్లీ కన్వీనర్  మాడ గౌతంరెడ్డి మండల అధ్యక్షులు రామిడి ఆది రెడ్డి  ఆధ్వర్యంలో బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ  జెండా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆదిరెడ్డి  మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బిజేపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త తోడ్పడాలని పిలుపునివ్వడం జరిగింది. నాడు రెండు సీట్లతో మొదలై నేడు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీగా ఆవిర్భవించింది. పార్టీ ఇంత అభివృద్ధి చెందడానికి ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాలు చేసినారని గుర్తు చేసి, వారిని స్మరించుకోవడం జరిగింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తున్నది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారం దిశగా పరుగులు పెడుతున్న పార్టీ అధికారం కైవసం చేసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్ధులై ఉండాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింహ రాజు , హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి. సీనియర్ నాయకులు ముదుగంటి  విద్యాసాగర్ రెడ్డి. జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్  బత్తిని నరేష్ గౌడ్ , జిల్లా ఐటీ సెల్  కన్వీనర్ గొడుగు వినోద్ కుమార్ యాదవ్   , కిసాన్ వర్సెస్ జిల్లా కార్యదర్శి మారం తిరుపతి రెడ్డి , ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్  ఉపాధ్యక్షులు ముత్యాల రవీందర్  సర్పంచులు ఎనగంటి విజయ శ్రీనివాస్ , శక్తి కేంద్ర ఇన్చార్జిలు వరికొల్ రాజు, పెద్ది మల్లారెడ్డి  మోటం వెంకటేష్  కొలిపాక వెంకటేష్  ఎండి అఖిల్. ప్రశాంత్, శ్రీనివాస్, సదానందం, రమేష్, అనిల్, తో పాటు, నాయకులు  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు