Thursday, 5 November 2026

ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు జాగ్రత్త.

.!

– అర్హులైన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్స్ ఇవ్వండి..!

– బిజెపి నాయకులు బోస్లె మోహన్ రావ్ పటేల్ ఆధ్వర్యంలో మహాధర్నా…

భైంసా రూరల్ జనవరి 21 జనం సాక్షి

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, పేద ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని… ప్రజలను మభ్యపెట్టడం మానుకోని, అర్హులకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని ముధోల్ నియోజక వర్గ బీజేపీ సీనియర్ నాయకులు బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు.శనివారం కుభిర్ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించి, వివేకానంద చౌరస్తాలో రెండు పడకల ఇండ్లురాని పేద ప్రజలతో కలిసి రాస్తారోకో చేసారు. తహసిల్దార్ రావాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపైబైఠాయించారు.అనంతరం ఎమ్మార్వో రాస్తారోకో స్థలానికి రాగా… అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్స్ అందేలా చూడాలని వినతిపత్రం అందిచారు.ఎమ్మార్వో సానుకూలంగా స్పందించారు. అనంతరం మోహన్ రావ్ పటేల్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అర్హులైన నిరుపేదలందరికీ రెండు పడకల గదుల ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన కేసీఆర్ 10 సంవత్సరాల పదవీకాలం ముగుస్తున్న పేదలకు మాత్రం ఇచ్చినహామీనెరవేర లేదని
ఆ తర్వాత స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. మళ్లీ మాట మార్చి మూడు లక్షలు రూపాయలు ఇస్తామని చెబుతుండడం పేదప్రజలను మభ్యపెట్టి కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో పేదప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అర్హులైన పేద ప్రజలకు రెండు పడక గదుల ఇల్లు ఇచ్చేంతవరకు పోరాటం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ముధోల్ తాలూకా పార్లమెంట్ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, కుబీర్ మండల బిజెపిసీనియర్ నాయకులు పుప్పాలలింగం,డాక్టర్ పోశెట్టి, వెంకటస్వామి,బాలరాజు,గణేష్,దేవిదాస్,సిరిపెల్లి సర్పంచ్ రఘు, కమలేష్, గణేష్, నర్సింగ్,దిలీప్, సుభాష్ పటేల్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.