హలో మాదిగ చలో అంగడిపేట ఎక్స్ రోడ్
ఎంఆర్ పిఎస్ దేవరకొండ నియోజకవర్గ సదస్సును విజయవంతం చేయాలి
పెద్దఅడిషర్లపల్లి జనవరి 13(జనంసాక్షి):పి.ఏ.పల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్ లో జరిగిన ఎంఆర్ పిఎస్ టిఎస్ మండల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం జిల్లా కార్యదర్శి ఎర్ర యాదగిరి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది,ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు ముదిగొండ ఎల్లెష్ మాదిగ గారు హాజరై ఈనెల 23న అంగడిపేట ఎక్స్ రోడ్ లో ఎంఆర్ పిఎస్ దేవరకొండ నియోజకవర్గం సదస్సు నిర్వహించే కార్యక్రమంలో మాదిగ,మాదిగ ఉపకులాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న రాష్ట్ర అధ్యక్షులు, వంగపల్లి శ్రీనన్న మాదిగ, జాతీయ ఉపాధ్యక్షులు కత్తుల తులసీదాసు మాదిగ,జాతీయ కార్యదర్శి నకరకంటి అంజన్న ,కోర్ కమిటీ సభ్యులు దైదా రవి మాదిగ, నల్లగొండ జిల్లా అధ్యక్షులు మారుపాక నరేందర్ మాదిగ, జిల్లా కార్యదర్శి యాదగిరి, దేవరకొండ నియోజకవర్గం ఇంచార్జి మద్దిమడుగు రవి కార్యవర్గ సభ్యులు రమమపల్లి వెంకట్ మాదిగ, సీనియర్ నాయకులు ఏలేటి నరసింహ మండల నాయకులు మద్దిమడుగు అంజనేయులు మద్దిమడుగు కర్ణయ్య కొత్తపల్లి యేసు బోడ నాగరాజ్ మద్దిమడుగు వసంత్ తదితరులు పాల్గొన్నారు




