Thursday, 5 November 2026

ప్రజారోగ్యానికే అధిక ప్రాధాన్యత

– ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు
– అమ్మ ఒడి ఆహనాలు అద్భుత సేవలందిస్తున్నాయి
– కేసీఆర్‌ కిట్‌ల పథకంతో ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన కాన్పులు
– రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
– 145 కొత్త 108 అంబులెన్స్‌ వాహనాలు ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్‌, మే8(జ‌నం సాక్షి) : ప్రజారోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ నిజాంకాలేజ్‌ గ్రౌండ్స్‌లో 145 నూతన 108 వాహనాలను డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ¬ం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్‌లు 316 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో 145పాత వాహనాలను తొలగించి.. 145 కొత్త వాహనాలను మంగళవారం ప్రారంభించామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్యశాఖను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. మొబైల్‌ వైద్య సేవలను కూడా మరింత మెరుగుపరిచామని చెప్పారు. అటు సీఎం కేసీఆర్‌ సూచనలతో వైద్య శాఖ అభివృద్ధి పథంలో నడుస్తున్నదని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించామని తెలిపారు. రాష్ట్రంలో అమ్మ ఒడి వాహనాలు అద్భుత సేవలు అందిస్తున్నాయని చెప్పారు. 50 పార్థివ వాహనాల ద్వారా డెడ్‌బాడీలను వారి నివాసాలకు తరలిస్తున్నాం.. మరిన్ని పార్థివ వాహనాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కిట్స్‌తో ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరిగిందన్నారు. గర్భిణీలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతి సౌకర్యాలనుకల్పించటం జరిగిందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ అన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలంటే పేదలకు జంకేవారని, కానీ తెరాస హయాంలో ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేయడం ద్వారా పేదలతో పాటు మధ్య తరగతి కుటుంబాల ప్రజలుసైతం ప్రబుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు. ¬ం మంత్రి నాయిని మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుజలో ఉంచేందుకు కేసీఆర్‌ కృషి అమోఘమన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ కూడా హాజరయ్యారు.