Thursday, 5 November 2026

14న ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌, మే8(జ‌నం సాక్షి) : ఈ నెల 14న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రుల కమిటీ.. ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలతో ఇప్పటికే సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంది. ఈ క్రమంలో వారి సమస్యలపై మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి నివేదిక రూపొందిస్తున్నారు. ఈ నెల 11న సీఎం కేసీఆర్‌కు మంత్రుల కమిటీ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై నివేదిక సమర్పించనుంది. 14వ తేదీన సీఎం కేసీఆర్‌.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై చర్చించనున్నారు.