Thursday, 5 November 2026

ప్రజావాణికి 42 దరఖాస్తులు ప్రజావాణి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలిజిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

 

 

 

 

 

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, మే 15 :ప్రజావాణిలో వచ్చినదరఖాస్తుల సత్వర పరిష్కారం పై ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ శరత్ ,జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించి వచ్చిన అర్జీలను వెంట వెంటనే పరిష్కరించాలని తెలిపారు.

జాప్యం చేయకుండా, ఎప్పటికప్పుడు వెంట వెంటనే ఆర్జీ దారుల విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ప్రజావాణిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పింఛన్లు, రుణం మంజూరి, ఉద్యోగ కల్పన, ధరణి , తదితర సమస్యలపై పలువురు అర్జీదారులు విజ్ఞప్తులను కలెక్టర్ కు అందజేశారు.

ప్రజావాణికి (42) దరఖాస్తులు రాగా, అందులో (12) రెవెన్యూ శాఖ కు సంబంధించినవని,
(30) ఇతర శాఖలకు సంబంధించినవని తెలిపారు.

ఈ సందర్భంగా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ గ్రామానికి చెందిన దివ్యాంగుడైన పోచయ్య కు ఇంటి స్థలం పట్టా సర్టిఫికెట్ ను కలెక్టర్ అందజేశారు.

అదేవిధంగా రుద్రారం గ్రామానికి చెందిన పోచయ్య పిల్లలు దివ్యాంగులైన కుమారుడు సాయి ప్రసాద్, కూతురు చైతన్య లకు సంబంధించిన సదరం సర్టిఫికెట్ల ను పోచయ్యకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి,వివిధ శాఖల జిల్లా అధికారులు,రెవెన్యూ డివిజన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.