Friday, 6 November 2026

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు మేరకు గ్రామాలలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య సందర్శన

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు మేరకు
గ్రామాలలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య సందర్శన
వీణవంక డిసెంబర్ 16 (జనం సాక్షి) వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని సిసి రోడ్లు మొదలలైన అంశాల పై జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు అనుసరించి జిల్లా పంచాయతీ అధికారి పోతిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఫిర్యాదు పై విచారణ నిర్వహించడం జరిగినది మరియు క్షేత్ర పరిశీలన చేసినారు ఫిర్యాదు మరియు పారిశుధ్య కార్యక్రమాలు సెగ్రిగేషన్ షెడ్డు నిర్వహణ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి కంపోస్టు తయారు చేయుట ద్వారా స్మశాన వాటిక నిర్వహణ పారిశుధ్య కార్యక్రమాలు మొదలగు అంశాలపై అవెన్యూ ప్లాంటేషన్ చెట్ల నిర్వహణపై మరియు డ్రై డే ఫ్రైడే నిర్వాణపై పలు సూచనలు సలహాలు చేసినారు ప్రతి గ్రామపంచాయతీ పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించి ఆ గ్రామపంచాయతీ అందంగా తీర్చేదిద్దాలని తెలిపినారు తడి చెత్త ద్వారా చేసి విక్రయించాలని వచ్చిన ఆదాయంతో గ్రామపంచాయతీ నిధులకు సమకూర్చుకోవాలని మరియు కుడి చేత ద్వారా ప్లాస్టిక్ అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని తెలియపరిచినారు. దీంతో పాటు కొండపాక గ్రామపంచాయతీని కూడా సందర్శించి పలు సూచనలు సలహాలు చేసినారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య డివిజనల్ పంచాయతీ అధికారి లత మండల పంచాయతీ అధికారి ప్రభాకర్ ఆయా గ్రామాల సర్పంచ్లు పంజాల అనూష సర్పంచ్ అవాళ అరుంధంతి, ఉప సర్పంచ్ రాజ్ కుమార్ మరియు పంచాయతీ కార్యదర్శులు మొదలగు వారు పాల్గొన్నారు