సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
జహీరాబాద్ డిసెంబర్ 16 (జనం సాక్షి)నిత్యం కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడుతున్న సిఐటియు రాష్ట్ర 4వ మహాసభలు సిద్దిపేట పట్టణంలో 21 22 23వ తేదీల్లో జరుగుతున్నాయని, మహాసభలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, సహాయ కార్యదర్శి ఎస్.మహిపాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రామిక్ భవన్లో సిఐటియు మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు ఉద్యమాలు పోరాటాలు చేయడంతో పాటు, కార్మిక హక్కులను కాపాడేందుకు ఉద్యమిస్తున్న సిఐటియు రాష్ట్ర మహాసభలను కార్మిక వర్గం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గత కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని, బహిరంగ సభకు 23వ తేదీన కేరళ కార్మిక శాఖ మంత్రి హాజరవుతున్నారని, బహిరంగ సభకు జహీరాబాద్ ప్రాంత కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కనకా రెడ్డి, సుధాకర్, కృష్ణ, కృష్ణ, వీరయ్య గౌడ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు
సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి




