Thursday, 5 November 2026

ప్రజాసంగ్రామ యాత్ర ను విజయవంతం చెయ్యాలి : రాష్ట్ర

ప్రజాసంగ్రామ యాత్ర ను విజయవంతం చెయ్యాలి : రాష్ట్ర సంగ్రామ యాత్ర సహా ఇంఛార్జి తుళ్ళ వీరేందర్ గౌడ్
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 04,
జనంసాక్షి:
మెట్ పల్లి పట్టణంలో ని వెంకట్ రెడ్డి గార్డెన్ లో ప్రజా సంగ్రామ యాత్ర సమావేశానికి అధ్యక్షత వహించిన మొరపెళ్లి సత్యనారాయణ , ముఖ్య అతిధిగా తుళ్ళ వీరేందర్ గౌడ్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో బండి సంజయ్ చేయాలనుకున్న ప్రజా సగ్రామయాత్ర ను విజయవంతం చేయాలని రాష్ట్రం లో టిఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి బండి సంజయ్ కుమార్ నిర్వహిస్తున్న పాద యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని. జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాడానికి సంగ్రామ యాత్ర కమిటీ ని నియమించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు, జిల్లా ఇంచార్జి శేఖర్ జి, జిల్లా యాత్ర ప్రముక్ కరండ్ల మధుకర్, మాజీ ఎమ్మెల్యే విజయ్ పల్, రాజ్యవర్ధన్, అర్జున్ రెడ్డి, సుఖేందర్ గౌడ్, బీజేపీ మెట్ పల్లి పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్, బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనికేల నవీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి లు ఇళ్లేందుల శ్రీనివాస్, ర్యాగాళ్ల సత్యనారాయణ, జేన్ వెంకట్, నవీన్ కుమార్ తులా ఉమా పుదరి అరుణ కన్నం అంజయ్య కస్తూరి సత్యం మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.