Wednesday, 4 November 2026

మజ్జిగ పంపిణీతో ప్రజల దాహార్తికి ఉపశమనం

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ మిర్యాల వెంకటేశ్వర్లు తన మనవరాలు అన్విక పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఫ్లై ఓవర్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీష్మ తాపంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సుమారు వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ చేసినట్లు తెలిపారు.సేవా దృక్పథం , సామాజిక స్పృహతో ప్రజలకు అవసరమైన సేవలందించడం తనకు తృప్తిని కలిగించే అంశమని అన్నారు.ఈ కార్యక్రమంలో క్లబ్ సీనియర్ సభ్యులు మిర్యాల సుధాకర్ , రాష్ట్ర ఉత్తమ విశ్రాంత ఉపాధ్యాయులు, మాజీ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గుండా రమేష్ , రీజియన్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, ఎన్నారై సీనియర్ సిటిజన్ క్లబ్ అధ్యక్షులు పసుపర్తి కృష్ణమూర్తి , వాసవి సీనియర్ సిటిజన్ అధ్యక్షులు అక్కినపల్లి సత్యనారాయణ ,  తల్లాడ కృష్ణమూర్తి , చింత వెంకన్న , సత్యనారాయణ, సోమన్న , సతీష్ తదితరులు పాల్గొన్నారు.