Wednesday, 4 November 2026

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలి

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, జనవరి 23 (జనం సాక్షి);
ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు,
తాసిల్దారులకు ఆదేశించారు.
సోమవారం ప్రజా వాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి పిర్యాదు దారులు 85 పిర్యాదులు సమర్పించారని,వాటిలో ధరణి కి సంబంధించిన భూ సమస్యలపై 68 దరఖాస్తులు,
ఆసరా పెన్షన్లు 5 ఇతర సమస్యలకు సంబంధించి 12 దరకాస్తులు వచ్చినట్లు తెలిపారు.వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్,ఏవో యాదగిరి,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.