Friday, 6 November 2026

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం .. నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం .. నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి.

పెద్ద శంకరంపేట. జనం సాక్షి .నవంబర్ /26

. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ దేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.. శనివారం పెద్ద శంకరంపేట లోని ఎంపీపీ సమావేశ మందిరంలో ఎనిమిది మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు..  అనంతరం పేటలోని బేగారిగల్లి ఉప్పరిగల్లి మాధవ నగర్ కాలనీలలో నూతనంగా సిసి రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు..అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.. కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు వరం లాంటిదని ఆయన అన్నారు..      75 వ రాజ్యాంగ అవతరణ దినోత్సవ ప్రతిజ్ఞలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి..    పెద్ద శంకరంపేట లోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన 75 వ రాజ్యాంగ అవతరణ.  దినోత్సవం లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్.. తాసిల్దార్ చరణ్ సింగ్ ఎంపీడీవో రఫిక్ హుస్సేన్.. వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్ పేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ.. రైతు బంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కుంట్ల రాములు.. ఎంపీటీసీలు దత్తు వీణ సుభాష్ గౌడ్ .సర్పంచులు సుభాష్ .. నాగమణి విఠల్ గౌడ్. మాజీ ఎంపిటిసి వేణుగోపాల్ గౌడ్.. నాయకులు శంకర్ గౌడ్.. సలీం.  నారాయణ సతీష్ తదితరులు పాల్గొన్నారు…