యంజాల్ లో ఘనంగా 73వ భారత రాజ్యాంగ దినోత్సవం :శామీర్ పేట్, జనం సాక్షి :శనివారం
రోజు 73 వ భారత రాజ్యాంగ దినోత్సవం యంజాల్ లో ఘనంగా నాయకులు జరుపుకున్నారు.
దేశ ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలను అందించాలని రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడిన సందర్భంగా,, శనివారం రోజు తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ లో పలువురు నాయకులు,జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు,,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్సుమాంజలి తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవరయాంజాల్ మాజీ ఎంపిటిసి,తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి,రామాలయం మాజీ ధర్మకర్త ,టీచర్ పట్నం నర్సింహారెడ్డి,జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు హరికృష్ణా రెడ్డి,సుధాకర్ రెడ్డి,రాంమోహన్ రావు తిరుమలప్రసాద్,విద్యార్థులు పాల్గొన్నారు.
26ఎస్పీటీ -1: దేవర యంజాల్ అంబేద్కర్ కు నాయకులు
యంజాల్ లో ఘనంగా 73వ భారత రాజ్యాంగ దినోత్సవం




