ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం చేయాలి…ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం చేయాలి…
– భాజపా జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి.
జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 25
బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముధోల్ తాలూకా భై0సా పట్టణం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్క భాజపా కార్యకర్త హాజరై సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకండి రమాదేవి అన్నారు. ఈ సందర్భంగా భైంసా విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగ్రామ యాత్ర ముధోల్ తాలూకా ఇన్చార్జిఅల్జాపూర్ శ్రీనివాస్,జిల్లా అద్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ… రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పర్యటనలో భాగంగా మొదట సారంగాపూర్ మండలం అడెల్లి అమ్మపోచమ్మవారిని దర్శించుకోని ఆ తరువాత తాలూకా లోని బై0సా పట్టణంలో బైపాస్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, బహిరంగ సభ అనంతరం పాదయాత్రగా తాలుకలో పర్యటించనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరు కానున్నట్లు తెలిపారు .ఇట్టి పాదయాత్ర కార్యక్రమంలో ప్రజలు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో భాజపా నాయకులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం చేయాలి…ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం చేయాలి…




