వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలివరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా వైఎస్ చైర్మన్ కోనేరు కృష్ణ రావు
చింతలమానేపల్లి జనంసాక్షి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల బాగుకోసం ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులందరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా వైఎస్ చైర్మెన్ కోనేరు కృష్ణ రావు అన్నారు.శుక్రవారం రోజున మండల కేంద్రతో పాటు మండలంలోని రవీంద్రనాగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ డుబ్బుల నానయ్య,జెడ్పిటిసీ డుబ్బుల శ్రీదేవి,మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్,మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ డోకే రాజన్న,సహకార సంఘం చైర్మన్ కొమురం మంతయ్య,వైఎస్ చైర్మన్ మారుతి,సీఈవో రాజు ,మండల వ్యవసాయ అధికారి పి. రాజేష్,వ్యవసాయ విస్తరణ అధికారి శ్వేత,సెంటర్ ఇంచార్జీ సయ్యద్ అమీర్ హుస్సేన్,మండల కో-ఆప్షన్ నాజిమ్, తెరాస మండల అధ్యక్షుడు డబ్బుల వెంకన్న గ్రామ సర్పంచులు,ఎంపిటిసిలు, డైరెక్టర్లు,ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి




