Saturday, 7 November 2026

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వేమనపల్లి,డిసెంబర్ 23,(జనంసాక్షి):

మండలంలోని సమస్యలను పరిష్కరించాలని వేమనపల్లి తహశీల్దార్ ఆఫీస్ ముందు భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రేగుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ..డబల్ బెడ్రూమ్ ఇండ్లు,ఇండ్ల స్థలాలు,పోడు భూములకు పట్టాలు,సబ్ స్టేషనుకు స్థలం కేటాయించాలని అన్నారు.అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, దళిత బందు,మత్తడి వాగుపై వంతెన నిర్మించాలని,మండలానికి ఇంటర్ టు డిగ్రీ కాలేజీ స్థలం కేటాయించాలని, మండలంలోని పలు గ్రామాలకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అన్నారు.బెల్లంపల్లి నుండి వేమనపల్లి వరకు బస్సు సౌకర్యం,ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు స్టాఫ్ నర్స్ లను నియమించాలని డిమాండ్ చేసి తహసిల్దార్ రాజకుమార్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వేమనపల్లి మండల కార్యదర్శి అందె పురుషోత్తం,ప్రధాన కార్యదర్శి అందె మహేష్,కోశాధికారి దేవనబోయిన చిన్న శంకర్, తోకల హనుమంతు,బద్దంపల్లి కార్యదర్శి మడె మహేష్,బోగారం శంకర్,రాజారాం కార్యదర్శి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.