Saturday, 7 November 2026

మహా రైతు ధర్నాకు తరలి వెళ్లిన బిఆర్ఎస్ మండల నాయకులు

మహా రైతు ధర్నాకు తరలి వెళ్లిన బిఆర్ఎస్ మండల నాయకులు

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (23): రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ కుంట్ల తారక రామారావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతు కల్లాల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ, ఈజీఎస్ నిధుల తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా రైతు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి గోపాల్ పేట్ మండల ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు తరలి వెళ్లిన వారిలో మండల జడ్పిటిసి మంద భార్గవి, ఎంపీపీ సంధ్య, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, మండల అధ్యక్షులు గాజుల కోదండం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తిరుపతి యాదవ్, మండల సీనియర్ నాయకులు మంద కోటీశ్వర్ రెడ్డి, గోపాల్ పేట్ సర్పంచ్ శ్రీనివాసులు, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాజేష్ గౌడ్, మండల నాయకులు శ్రావణ్ కుమార్, వడ్డేమాన్ రవి, నాగరాజు, మహేష్ తదితరులు ఉన్నారు