Wednesday, 4 November 2026

ప్రజా సమస్యలు పరిష్కరించడం లో పత్రికలు ముందుండాలి

ప్రజా సమస్యలు పరిష్కరించడం లో పత్రికలు ముందుండాలి

నందివనపర్తి ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, జనవరి 10 (జనంసాక్షి): జనంసాక్షి తెలుగు దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన నందివనపర్తి ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనంసాక్షి దినపత్రిక ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారంలో అలుపెరుగని పోరాటం చేస్తోందని ప్రజల గొంతుకగా నిజ నిజాలను నిర్భయంగా వెల్లడించడంలో జనంసాక్షి పత్రిక ముందు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాలకు అధికారులకు వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పత్రికలు నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొండాపురం నాగరాజు ,గడ్డం దయాకర్, మాజీ వార్డు సభ్యులు జెనిగే వెంకటేష్, మూడెడ్ల విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు