సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే సారయ్యటేకులపల్లి, ఫిబ్రవరి 12( జనం సాక్షి): అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కే సారయ్య అన్నారు. మండల కేంద్రంలో సిపిఐ టేకులపల్లి మండల కౌన్సిల్ సమావేశం అయిత శ్రీరాములు అధ్యక్షతన సిపిఐ పార్టీ కార్యాలయం నందు ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బడా బాబులకు అనుకూలంగా ఉందని, పేద ప్రజలకు ఏమి న్యాయం జరగలేదని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ డోలాగా ఉందని అన్నారు. విద్య,వైద్యం రంగాన్ని నిర్వర్యం చేసేలా కేటాయింపులు ఉన్నాయని, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైందని, ప్రజలు సమస్యలపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యచరణ రూపొందించి పోరాటాలకు నాంది పలకాలని అందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు. పోడు భూముల పట్టాలు సర్వే చేసిన వార అందరికీ ఇవ్వాలని,డబల్ బెడ్ రూమ్ ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్,పార్టీ మండల కార్యదర్శి గుగులోతు రామచందర్, సహాయ కార్యదర్శిలు గుగులోతు శ్రీను,వాసం భద్రయ్య, తేజావత్ మధు, ఈసం నరేష్,వాసం నరేందర్, కోటి, సోనీ, భారతి,విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.




