జనం సాక్షి: డిసెంబర్ 21 కొల్లాపూర్ రూరల్
ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మండల రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న ఆందోళనలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు s m d ఫేయాజ్ గారు మాట్లాడుతూ
మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి నుండి తమరి ద్వారా ప్రభుత్వాని కోరుతున్నది ఏమనగా ప్రజల అభివృద్ధి కొరకు సమక్షేమం కొరకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అదేవిధంగా పెరుగుతున్నటువంటి నిత్యవసర వస్తువుల ధరలను అరికట్టడంలో విఫలమైతున్నారు ధరల పెరుగుదల వలన ప్రజాజీవనం అస్తవ్యస్తమవుతున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలను నాలుగుసంవత్సరాలు పూర్తి అయినా నేటికీ అమలు చేయకపోవడం శోచనీయం దీనిని నిరసిస్తూ ఈ క్రింది డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త గా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా మా ఈ డిమాండ్స్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము
1) అర్హత కలిగిన అందరికీ సొంత జాగాలో ఇల్లు నిర్మించుకొనుటకు ఐదు లక్షలు రూపాయలు తక్షణమే ఇవ్వాలి (2) లక్ష రూపాయల రుణమాఫీని తక్షణం అమలు చేయాలి (3) 57 సంవత్సరాల పూర్తి అయిన వారికి అందరికీ తక్షణమే పెన్షన్లను ఇవ్వాలి ఇతర సామాజిక పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి తక్షణం పెన్షన్లుఇవ్వాలి నూతన పెన్షన్ల మంజూరులో పెట్టినటువంటి అనేక నిబంధనలను రద్దు చేయాలి (4) ధరణి పోర్టల్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అసైన్డ్ భూములను విరాసత్ (వారసులకు పట్టా మార్పిడి) చేయుటను తక్షణమే ప్రారంభించాలి (5) నూతన రేషన్ కార్డులను ఇవ్వాలి (6) రాజకీయ జోక్యం లేకుండా అర్హత కలిగిన వారికి దళిత బంధు ఇవ్వాలి (7) స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
(8) పోడు భూములు సాగు చేసుకుంటున్నా గిరిజనులతో పాటు ఎస్సీ,బీసీలకు పట్టాలు ఇవ్వాలి (9) ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు చెల్లించవలసిన నిధులను తక్షణమే చెల్లించాలి కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు కామ్రేడ్ ఆర్ ఇంద్ర గారు జిల్లా సమితి నాయకులు కురుమయ్య గారు కొల్లాపూర్ సిపిఐ పట్టణ కార్యదర్శి ఎండి యూసుఫ్ సింగోటం సర్పంచ్ లాలి కృష్ణయ్య శాఖ కార్యదర్శి డి వెంకటస్వామి శేఖర్ ఇటికల కురుమయ్య విజయ్ ఖాదర్ మహిళలు లక్ష్మి వరలక్ష్మి సిపిఐ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మండల రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న ఆందోళనలో




