ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
వికారాబాద్ రూరల్ జూలై 11 జనం సాక్షి
ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని వికారాబాద్ జిల్లా, బి ఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్” పేర్కొన్నారు మంగళవారం”మీతో నేను”* కార్యక్రమంలో భాగంగావికారాబాద్ పట్టణంలోని 18, 20, 29, 30వ* వార్డులలో ఉదయం పర్యటించారు.మిషన్ భగీరథ పైపు లీకేజీలు లేకుండా ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ మంచి నీటిని అందించాలన్నారు.బావుల పై కప్పులు ఏర్పాటు చేసి, పాడు బడ్డ ఇండ్లు తొలగించాలన్నా రూ వార్డులలో పాత స్థంబాలు తొలగించి, అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేసి, వాటికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. వార్డులలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ లు మరో ప్రదేశానికి షిఫ్టింగ్ చేయాలని, రోడ్ల మధ్యలో ఉన్న ఐరన్ పోల్స్ తీసివేసి, అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేసి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలన్నారు. విద్యుత్ తీగలకు తాకుతున్న చెట్ల కొమ్మలను తొలగించి, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలన్నారు.శానిటేషన్ ఎప్పటికప్పుడు చేస్తూ.కాలనీలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.కాలనీలలో రోడ్లు మరియు తదితర అభివృద్ధి పనులకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్ మాజీ చైర్మన్ లంకా పుష్పలత రెడ్డి కృష్ణారెడ్డి శ్రీనివాస్ గౌడ్ సువర్ణ కృష్ణ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ లంక లక్ష్మీకాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.