ప్రతిభ కనబరిచిన అధికారులకు సిబ్బందికి ప్రసంశ పత్రం అందజేసిన జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్
గద్వాల నడిగడ్డ, డిసెంబర్ 22 (జనం సాక్షి);
జిల్లా పోలీస్ శాఖలో ఆయా పోలీస్ స్టేషన్ లలో సిబ్బంది, పోలీస్ అధికారుల పని తీరును మెరుగుపరిచేందుకు అమలవుతున్న 13 వర్టికల్ విభాగాలలో నవంబర్ నెలలో ప్రతిభ కనబరిచిన అధికారులకు,సిబ్బందికి జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ప్రసంశ పత్రాలు అందజెసి అభినందించారు.ఈ సంద్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాధ్యత తో పని చేసే సిబ్బందికి, అధికారులకు పోలీస్ శాఖ లో తగిన గుర్తింపు ఉంటుందని, వారు మరింత ఉత్సాహం తో పని చేసేందుకు రివార్డ్స్ మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని అన్నారు. ప్రశంస పత్రాలు అందుకున్న వారిలో ఎస్ హెచ్ ఓ విభాగం లో మల్దకల్ ఎస్సై ఆర్. శేఖర్, ఇటిక్యాల ఎస్సై గోకారి, ట్రాఫిక్ విభాగం లో ఉండవెల్లి ఎస్సై బాలరాజు, ఎస్సై గొకారి, ఇటిక్యాల ఇన్వెస్టిగేషన్ విభాగంలో ఆనంద్, ఎస్సై గద్వాల్ రూరల్, ఎస్సై శేఖర్ రెడ్డి, ధరూర్, సెక్షన్ ఇంఛార్జి విభాగంలో హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసులు, తిమ్మప్ప, బ్లూ కోల్ట్స్ విభాగంలో కానిస్టేబుల్స్ ఇస్మాయిల్, రమేశ్, సమ్మన్స్, కోర్టు డ్యూటీ విభాగంలో కానిస్టేబుల్స్ రాఘవేంద్ర, రామ చంద్రుడు, రవి, పెట్రొకార్స్ విభాగం లో రమేశ్- గద్వాల్ టౌన్, ఖాదర్ పాషా స్టేషన్ రైటర్స్ విభాగంలో రమేశ్- గట్టు, చంద్ర శేఖర్ టెక్ టీం విభాగంలో రామ కృష్ణ, పాలక్షి రెడ్డి, రమేశ్ బాబు, రవి కుమార్ రిసెప్షన్ విభాగంలో సత్య సావీత్రి, గోవిందు, వారెంట్స్ విభాగములో గజేంద్ర తిప్పన్నా లు, హెచ్ ఆర్ ఎం ఎస్ విభాగములో ఎండీ హనీఫ్ సీనియర్ అసిస్టెంట్, రవి శంకర్ జూనియర్ అసిస్టెంట్ లు ప్రశంస పత్రాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో డి. ఎస్పి ఎన్. సి హెచ్ రంగ స్వామి, కార్యాలయ ఏ. ఓ సతీష్ కుమార్, డిసి ఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గద్వాల సి. ఐ చంద్ర శేఖర్, అలంపూర్ సి. ఐ సూర్య నాయక్, ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభ కనబరిచిన అధికారులకు సిబ్బందికి ప్రసంశ




