శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారి ఆలయానికి భూమి దానం
-అర ఎకరం భూమిని దానం చేసిన పోట్ల రోశయ్య
మహబూబాబాద్ బ్యూరో-డిసెంబర్22(జనంసాక్షి)
కాలజ్ఞాని శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి హైదరాబాద్ వాస్తవ్యులు గార్ల మండలానికి చెందిన పోట్ల రోశయ్య తన భార్య వెంకట నర్సమ్మ, కుమారులు శ్రీనివాస్ రావు, రామకోటేశ్వరరావులు గార్ల,డోర్నకల్ మండలాల మధ్యలోని పెట్రోల్ బ్యాంకు పక్కనగల వారి భూమి అర ఏకరాన్ని ఆలయ నిర్మాణానికి రాసి ఇచ్చి వారి భక్తిని చాటుకున్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు రావూరి సత్యనారాయణ చారి, ప్రధాన కార్యదర్శి పోలోజు వెంకన్నచారి కోశాధికారి పధిలోజు లక్ష్మణాచారి లకు పత్రాలు అందించి ఆలయ నిర్మానాన్ని త్వరలో పూర్తి చేయాలని కోరారు.




