Saturday, 7 November 2026

ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి

ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి
– శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి
హుజూర్ నగర్ డిసెంబర్ 19 (జనం సాక్షి): ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శివ స్వామి కోరారు. సోమవారం పట్టణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రవచనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలన్నారు. భక్తితో ఏదైనా సాధించవచ్చునని అన్నారు. దేశంలోని అనేక హిందూ దేవాలయాల పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా ఆలయాల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విలువలను కాపాడాలన్నారు. భారతదేశంలో హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో గౌరవం గుర్తింపు కలిగిందన్నారు. ధర్మ పరిరక్షణకు కంకణ బద్దులు కావాలన్నారు. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చావ సహదేవరావు, త్రిపురమళ్ళ అంజయ్య, గజ్జి ప్రభాకర్, కే రామ్మోహన్రావు, కే నాగేశ్వరరావు, శాఖమూరి రవికుమార్ చౌదరి, డాక్టర్ శివప్రసాద్ చౌదరి, వేముల నరసయ్య, గుండా శ్రీనివాస్, ఏలూరి రాంబాబు, వెంకటరెడ్డి, రవీందర్ లక్ష్మయ్య , నలమాల శ్రీనివాస్, గార్లపాటి శ్రీనివాస్ , గెల్లిఅప్పారావు, శేఖరు, వెంకట నరసయ్య, పోలిశెట్టి నరసింహారావు, రామారావు పాల్గొన్నారు.