Saturday, 7 November 2026

వెడ్మ బొజ్జు కి సన్మనించిన కాంగ్రెస్ నాయకులు.

వెడ్మ బొజ్జు కి సన్మనించిన కాంగ్రెస్ నాయకులు.

జనం సాక్షి ఉట్నూర్.

మండల కేంద్రంలోని టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంధర్భంగా అదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఖానాపూర్ నియోజకవర్గం నాయకులు వేడ్మ బోజ్జు పటేల్ కి సోమవారం నార్నూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. అనంతరం మండల అధ్యక్షుడు యూసఫ్ ఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడుతున్న నాయకులకు అధిష్టానం గుర్తించి టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా అదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేడ్మ భొజ్జు పటేల్ నీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాదవ్ కైలాష్ కరీం ఖాన్ తానాజీ నాయక్ సయ్యద్ నిజాం ధన్ లాల్ చౌహాన్ కరీం ఖాన్ మాణిక్ రావు ఆడే ఎస్టీ సెల్ తోడ్సం విష్ణు మైనార్టీ సెల్ షాకిబ్ ఖాన్ నసీర్ కార్తీక్ నారాయణ రాజేందర్ రాహుల్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు