Thursday, 5 November 2026

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి దోమ నవంబర్ 25(జనం సాక్షి)
ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని పాలేపల్లి సర్పంచ్ యశోద తిరుపతి సాగర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పాలేపల్లి గ్రామంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆంజనేయ స్వామి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.పల్లకి సేవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనిపూజా కార్యక్రమాలు నిర్వహించారు,అనంతరం శ్రీ రామాంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోతిరుపతి సాగర్,ఆత్మలింగం,రిపోర్టర్ నరసింహులు,కిష్టప్ప,విజయ్,రామచంద్రయ్య,చాకలి వెంకటయ్య భజన మండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు