..
శంకరపట్నం: జనం సాక్షి జనవరి 25
జనవరి 26న నిర్వహించే రిపబ్లిక్ దినోత్సవం వేడుకల్లో జాతీయ జెండా వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు గొట్టి అర్జున్ డిమాండ్ చేశారు. బుధవారం ఆ సంఘం ఆధ్వర్యంలో మండల ఇన్చార్జి విద్య శాఖ అధికారి కేతిరి వెంకట నరసింహ రెడ్డికి ఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ప్రతి పౌరునికి హక్కులు కల్పించారాని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటోలు రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి నివేదించాలని మండల ఇన్చార్జి ఎంఈఓ వెంకట నరసింహారెడ్డికి వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వడ్ల రాజు, గోదారి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
రిపబ్లిక్ దినోత్సవం లో అంబేద్కర్ బొమ్మ పెట్టాలి




