Tuesday, 3 November 2026

ప్రతి పిర్యాదు పట్ల స్పందిస్తాం-జిల్లా ఎస్పీ కె. సృజన.

 

గద్వాల నడిగడ్డ, జూన్ 26 (జనం సాక్షి);
గ్రీవెన్స్ డే ద్వారా వచ్చే ప్రతి పిర్యాదు పై స్పందించి బాధితులకు న్యాయం అందించే విధంగా పని చేయడమే తమ లక్ష్యమని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కె. సృజన తెలిపారు.
సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన పిర్యాదు దారుల నుండి 15 ఆర్జీలు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. భూ తగాదాలు, ఆస్థి తగాదాల విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు. గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తున్నామన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.
భూ వివాదాలకు సంబందించి 05 పిర్యాదులు,
గొడవలకు సంబందించి 03పిర్యాదులు,ప్లాట్ ఆక్రమణకు సంభందించి -01.ప్రాపర్టీ లాస్ కు సంబందించి ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె తెలిపారు.