
తూప్రాన్ జూన్ 26( జనం సాక్షి) ::: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు హరిప్రసాద్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఆధ్వర్యంలో తాసిల్దార్ జ్ఞాన జ్యోతికి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు పెన్షనర్లు అనారోగ్య కారణాలతో లక్ష రూపాయల వరకు బిల్లులు వస్తున్నాయని దీనిని ఈ హెచ్ ఎస్ ద్వారా అమలుపరచాలని పెండింగ్లో ఉన్న డి ఆర్ బిల్లును వెంటనే చెల్లించాలని ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న ఈ కుబేర్ బిల్లులను చెల్లించాలని కోరారు 398 ద్వారా నియమాకమైన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని జీవనవేయం పెరిగినందున ప్రతి పెన్షన్ దారుకు 30 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు హరిప్రసాద్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ సభ్యులు శ్రీనివాస్ నాగభూషణం బిక్షపతి గౌడ్, రాములు గౌడ్, రాజయ్య చార్లెస్ మల్లారెడ్డి నరసింహారెడ్డి నరసింహులు తదితరులు పాల్గొన్నారు




