Thursday, 5 November 2026

ప్రతి యేడాది రైతులు మృత్తికలను (భూసార) పరీక్షలు చేయించుకోవాలి.

ప్రతి యేడాది రైతులు మృత్తికలను (భూసార) పరీక్షలు చేయించుకోవాలి.
:ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్.

ఖమ్మం. తిరుమలాయపాలెం.(డిసెంబర్05) మండల కేంద్రంలోనీ రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రపంచ మృత్తీకల (నేల) ధినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో. ముఖ్యఅతిథిగా ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ .రైతులు సేంద్రీయ ఎరువులను వాడుకొని వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలని, రైతులు నకిలీ విత్తనం, నకిలీ మందులను వాడోద్దనీ రైతులు వ్యవసాయ అధికారుల మృత్తికా పరీక్షల. సలహా సహకారాలు తీసుకొని తమ పంట పొలాలలో పంటలను వేసుకోవాలని, అదిగదిగుబడితో అధిక లాభం వచ్చే పంటలను వేసుకోవాలని, వ్యావసాయధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారి పంట పొలాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ధాన్యాలను,పనిముట్లు సబ్సిడీ రూపంలో ఇస్తుందనీ రైతులు అవకాశాలను సద్వినియోగంచేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏవో సీతారామిరెడ్డి,కోక్కీరేణీ ఎంపీటీసీ సభ్యులు గుగ్గిళ్ల అంబేద్కర్, స్థానిక సర్పంచ్ వేంకటేశ్వర్లు,ఎఇఓ లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.