రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం మరియు నిరుద్యోగ భృద్ధి, జారీ వెంటనే విడుదల చేసి చెల్లించాలి

బిజేవైయం జిల్లా అధ్యక్షుడు పవన్ ముదిరాజ్.
సంగారెడ్డి  ప్రతినిధి డిసెంబర్ 05:(జనం సాక్షి:)
బీజేవైఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజర్షిష కు నిరుద్యోగ సమస్యల వినతి పత్రం అందజేశారు  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు & జిల్లా బీజేవైఎం ఇంచార్జ్ రాగిర్ సాయి రాం గౌడ్ విచ్చేసి. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీలు నిరుద్యోగ భృతి 3016 ఇస్తామన్నారు అప్పటినుండి ఇప్పటివరకు 48 నెలలు గడిచింది 1,44,768 రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసి డిమాండ్ చేశారు. అలాగే జారీ చేసిన నోటిఫికేషన్లకు ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని హెచ్చరించారులేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో యువమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి ఠాకూర్ రాకేష్ సింగ్ , జిల్లా ఉపాధ్యక్షులు సందీప్ గౌడ్  జిల్లా ఆఫీస్ సెక్రటరీ ఆదిత్య గారు, జిల్లా సోషల్ మీడియా కన్వినర్ రాకేష్  బీజేవైఎం అసెంబ్లీ కన్వినర్ ప్రవీణ్ యాదవ్ ,బీజేపీ ఐటీ & సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ వెంకట్ గౌడ్, యువమోర్చ మండల అధ్యక్షులు వినోద్, దేవేందర్, రవి, అంజి.. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు