Thursday, 5 November 2026

ప్రతీ కార్యకర్త ఇంటికి పెద్ద దిక్కు కేసీఆర్ – కార్యకర్తలే పార్టీ కి పునాది కార్యకర్తలకు అండగా బి.ఆర్.ఎస్. – ఎమ్మెల్యే సైదిరెడ్డి

 

 

 

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 17 (జనంసాక్షి): ప్రతీ కార్యకర్త ఇంటికి కేసీఆర్ పెద్ద దిక్కులా ఉంటారని, బీఆర్ఎస్ పార్టీ కి కార్యకర్తలే పునాది అని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వేజెండ్ల ప్రసాద్ (24 వ వార్డు ), ఆల్వాల లక్ష్మీ (9 వ వార్డు ) లు ప్రమాదవశాత్తు ఇటీవల మరణించగా వారి కుటుంబాలలోని నామినీలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మొత్తం 4 లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కు లను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వారి ఇంటికే వెళ్లి అందజేశారు. బుధవారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ
బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలకు అన్నివిధాల అండగా ఉంటానని కార్యకర్తల కొసం బి.ఆర్.ఎస్ పార్టీ 18 వేల కోట్ల రూపాయలను ఇన్సూరెన్స్ కొరకు చెల్లిస్తుందన్నారు. కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించడం ద్వారా వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కులా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తుంన్నారని గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు. అటువంటి కార్యకర్తలను వారి కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకోవడం భాద్యత అన్నారు. బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా పార్టీ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యకర్తలు వారి కుటుంబాల భాద్యత, కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన ప్రమాద బీమా పథకం ద్వారా ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. కార్యకర్తలందరు ప్రమాద భీమా పథకంలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనరవి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మీసాల కిరణ్ కుమార్, వార్డు ఇన్చార్జులు ఇందిరాల రామకృష్ణ, మీసాల శరత్ కుమార్, మలిదశ తెలంగాణ ఉద్యమం కారుడు ఎడ్ల విజయ్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు లిఖిత్ , రమణ వేజెండ్ల, వినయ్, బుజ్జి, మంగమ్మ, నాని, వార్డు ప్రజలు పాల్గొన్నారు.