ముంపు గ్రామాలను సంబంధించిన సమస్యలను వేగవంతంగా పరిష్కరించి వారికి పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.బుధవారం జిల్లా సమీకృత సముదాయాల భవనంలో జిల్లా అధికారులతో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ప్రతిపాదించిన అంశాలపై ముంపు గ్రామాలైన రాంనూర్, తాళ్ల కొత్తపేట, చెగ్యాం, కోటిలింగాలు, ముక్కట్రావు పేట గ్రామాలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ముంపు గ్రామంలో ఇల్లు కోల్పోయిన 135 కుటుంబాలకు పరిహారం అందించాలని, ఆబాది భూమి కి పరిహారం అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులని ఆదేశించారు. అలాగే ముక్కట్రావు పేటలో సుమారు 36 ఎకరాల అసైన్డ్ భూములకు పరిహారం అందించుట గురించి అధికారులకు సూచించారు. మరియు ఇతర అంశాలపై కలెక్టర్ అధికారులకు వివరించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, R&R కమిషనర్ rafil daftham, జగిత్యాల,పెద్దపల్లి ఆర్డీఓలు వెంకటమాధవ రావు, మాధవి, తహశీల్దార్లు, ఇరిగేషన్ అధికారులు, R &B అధికారులు, పర్యవేక్షకులు, ముంపు గ్రామాల సర్పంచులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల గారిచే జారీ చేయబడింది.




