ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం: 2012-13 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ కోర్సుల ప్రవేశానికి సంబంధించి ప్రత్యేక కేటగిరీ ఎస్‌సీసీ, ఆర్మీ, స్పోర్ట్స్‌ ఆండ్‌ గేమ్స్‌ వికలాంగ అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆగస్టు 6వ తేదిన ఎన్‌సీసీ, ఆర్మీ అభ్యర్థులకు, 7న క్రీడ, వికలాంగ అభ్యర్థులు రావలసి ఉంటుంది. వీరికి ఆయా రిజర్వేషన్ల శాతాల ప్రకారం రెండోవిడత కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయిస్తారని రిజిస్ట్రార్‌ డాక్టర్‌. టి. వేణుగోపాలరావు తెలిపారు.

తాజావార్తలు