Wednesday, 4 November 2026

సబ్సిడీ పై జీలుగ విత్తనాలు

జనం సాక్షి.మిర్యాలగూడ. సబ్సిడీపై జీలుగు విత్తనాలు అందిస్తున్నట్లు మిర్యాలగూడ వ్యవసాయ అధికారిని స్టెఫీ గ్రాఫ్ తెలిపారు. శనివారం స్థానికంగా మాట్లాడుతూ మిర్యాలగూడ మండల పరిధి లోని రైతులకు సబ్సిడీ తో కూడిన జీలుగ విత్తనాలు మిర్యాలగూడ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం లో అందుబాటులో ఉన్నాయని,30 కేజీల జీలుగ బ్యాగ్ ధర రూ. 842.70.గా పేర్కొన్నారు..అవసరమైన రైతులు భూమి పాసు పుస్తకం,ఆధార్ కార్డు జిరాక్స్ తో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కొనుగోలు చేయవచ్చని అన్నారు.