Thursday, 5 November 2026

ప్రత్యేక నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు

 చిత్ర పటానికి పాలాభిషేకం.
కొండమల్లేపల్లి జనవరి 20 జనం సాక్షి న్యూస్ :
దేవరకొండ పట్టణంలోని గరుడాద్రి వేంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి కృషి ఫలితం, ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ సహకారంతో SDF (Special Development fund) ద్వారా శ్రీ గరుడాద్రి వేంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి 6 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్ర పటానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వయాన ఆధ్యాత్మిక చింతన కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ తెలంగాణలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నారని కీర్తించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ చేకూరిందని అన్నారు. యాదాద్రి, వేములవాడ, కొండగట్టు, రామప్ప వంటి అనేక ప్రాచీన దేవాలయాలను అత్యాధునిక సాంకేతిక వసతులతో పునః వైభవాన్ని సంతరించుకునే విధంగా ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. దేవరకొండ అభివృద్ధిలో భాగంగా శ్రీ గరుడాద్రి వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి గణనీయంగా నిధులు కేటాయించినందుకు ఈ నియోజకవర్గ ప్రజలు శ్రీ కేసీఆర్ గారికి కృతజ్ఞతలతో ఉంటారని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో
ఆలయ కమిటీ అధ్యక్షులు అల్లంపల్లి నర్సింహ , మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ కార్యదర్శి దొడ్డి అశోక్, కోశాధికారి శిరందాడు కృష్ణయ్య, పానుగంటి మల్లయ్య, వేంకటేశ్వర్లు, ఇమ్మడి భద్రయ్య, బెజవాడ నరేందర్, నక్క వేంకటేశ్వర్లు, చిదుర్ల వెంకటేష్, కర్నాటి పురుషోత్తం, రవీందర్ గౌడ్, గార్లపాటి ఎల్లయ్య, వాస నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, కుంటల విజయ్ తదితరులు పాల్గొన్నారు.