* చివరి రోజున బేతంపూడి దర్గాలో అన్నదానం
టేకులపల్లి, జనవరి 20( జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని బేతంపూడి దర్గాలో మూడు రోజులు ఉరుసు షరీఫ్ ఉత్సవాలు ఘనంగా జరిగి విజయవంతం అయ్యాయి. భక్తులు భారీగాఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. 18 వ తారీఖున హజరత్ సయ్యద్ జమాలుద్దీన్ బిహారి బాబా షహీద్ ( బాబా) గంధం కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్ సి మాలిక్ జమాల్ పాన్ షాప్ నుండి సాయంత్రం 6 గంటలకు తీసుకొని ఎంతో వైభవంగా భక్తులు బయలుదేరి బేతంపూడి దర్గాకు చేరుకున్నారు. చివరి రోజు శుక్రవారం దర్గా కమిటీ నిర్వాహకులు మహా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి ఖవ్వాలి ప్రోగ్రామ్ను నిర్వహించారు. మండలంలోని చుట్టుప్రక్కల గ్రామాలనుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇల్లందు, కొత్తగూడెం,హైదరాబాద్ పట్టణం నుండి ఈ ఉరుసు ఉత్సవానికి ముస్లిం భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నార.ఈ కార్యక్రమంలోదర్గా కమిటీ నిర్వాహకులు షకీల్ , ఆశిల్, జానీ, కాజా, తాజు, షఫీ తదితరులు పాల్గొన్నారు.




