ప్రథమ చికిత్స కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్
మల్దకల్ డిసెంబర్ 21 జనం సాక్షి మండల పరిధిలోని మద్దెలబండ గ్రామంలో బుధవారము ప్రథమ చికిత్స కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ కొత్తింటి జయమ్మ నారాయణ ప్రారంభించారు. శ్రీ శివ సీతారామాంజనేయ స్వామి దేవాలయం షాపింగ్ కాంప్లెక్స్ లో ప్రధమ చికిత్స కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రాథమిక చికిత్స చేసి వైద్య సేవలు అందిస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విబి ఈరన్న, ఎంబి క్రిష్టన్న గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు




