ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనం.
బెల్లంపల్లి, డిసెంబర్ 9, (జనంసాక్షి )
కేంద్ర ప్రభుత్వం సింగరేణి లోని నాలుగు బొగ్గు గనులను వేలం ద్వారా ప్రయివేటు కంపెనీలకు అప్పజెప్పడాన్ని నిరసిస్తూ శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలోని గనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మిత్రులకు బొగ్గుగనులను కట్టబెట్టడానికి కుట్రలు పన్నుతున్నాడని, అందులో భాగంగానే మందమర్రి డివిజన్ లోని కేకే 6, శ్రావణపల్లి గనులను వేలం పాటలో పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు టిబిజికెఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి దిష్టిబొమ్మ దహనం చేసినట్లు వారు తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి బొగ్గు బ్లాకుల వేలం పాట నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఏరియా నాయకుడు వెంకటరమణ, నాయకులు రాజనాల రమేష్, చిలుక రాజనర్సు, సూరం మల్లేష్, దాడి రమేష్, సిద్ధంశెట్టి సాజన్, సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ సభ్యులు, గని కార్మికులు పాల్గొన్నారు. 
ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనం.




