ప్రధాన రోడ్డుపై నిరసన ర్యాలీముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం భైంసా రూరల్ ఏప్రిల్ 05జనం సాక్షి
నిర్మల్ జిల్లా భైంసాపార్టీ అధినేత బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బీజేపీ నేతలు బుధవారం భైంసాలో ఆందోళనలు చేపట్టారు. పార్టీ భైంసా పట్టణ కమిటి అధ్యక్షుడు యనుపోతుల మల్లేశ్వర్, ముథోల్ నియోజకవర్గ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, ఉమ్మడి జిల్లా ప్రతినిధి నగర్ నారాయణ్ రెడ్డిల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ వాహానాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రధాన రోడ్డు మార్గంలో ముఖ్యమంత్రి దిష్టబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ.. అసమర్థ పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గాను ప్రతిపక్షాలపై అక్రమ కేసులు నమోదు చేయించి అరెస్టులు చేయిస్తుందన్నారు. ప్రశ్నించే గొంతుకలను లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. ప్రభుత్వానికి చేతనైతే ప్రశ్న పత్రాల లీకేజీల పర్వాన్ని నిరోధించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని హితవు పలికారు. అంతేగానీ లీకేజీలపై ప్రశ్నించే వారిని అరెస్టు చేయించడం సబబు కాదన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. ఇందులో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్, ప్రతినిధులు నిజాం వేణుగోపాల్, వై. నాగనాథ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.




